Friday, March 29, 2024

హ్యాట్సాప్ ఖలీల్ భాయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ కానిస్టేబుల్‌పై
ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రశంసల జల్లు

మన తెలంగాణ/హైదరాబాద్: హ్యాట్సాప్ ఖలీల్ భాయ్, మీరు ఇతరులకు ప్రేరణగా నిలిచారని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ద్విచక్ర వాహనం ఢీకొట్టిన వెంటనే కుప్పకూలిపోయిన యువకుడి గుండె కొట్టుకోవడం స్తంభించింది. అదే సమయంలో ఘటనాస్థలి వద్ద ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ తక్షణమే స్పందించి ప్రథమ చికిత్సలో భాగంగా ప్రమాదానికి గురైన యువకుడి గుండెపైన నిమిషం పాటు పంపింగ్ చేయడంతో సదరు యువకుడికి హార్ట్‌బీట్ మొదలైంది. వెంటనే ఆతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ స్పందించారు. ఆపత్కాలంలో ఆదుకుని సదరు యువకుడికి ప్రథమ చికిత్స నందించిన కానిస్టేబుల్ ఖలీల్‌ను అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News