హూస్టన్ : ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల నాసా నివాళి అర్పించింది. మేధావి హాకింగ్‌ను జ్ఞాపకం చేస్తూ బుధవారం నాసా తన ట్విట్టర్లో ఓ వీడియోను విడుదల చేసింది. హాకింగ్ ఓ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త అని, సైన్స్‌కు అంబాసిడర్ అని ప్రశంసించింది. ఈ విశ్వం గురించి చేస్తున్న మన ఆలోచనలను హాకింగ్ మార్చేశారని తెలిపింది. స్పేస్ స్టేషన్లో వ్యోమగాముల తరహా గురుత్వాకర్షణతో ఓ సూపర్మ్యాన్లా విహరించాలని నాసా కోరుకుంది. 2014లో హాకింగ్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉన్న వ్యోమగాములతో మాట్లాడారని తెలియజేసింది.
Remembering Stephen Hawking, a renowned physicist and ambassador of science. His theories unlocked a universe of possibilities that we & the world are exploring. May you keep flying like superman in microgravity, as you said to astronauts on @Space_Station in 2014 pic.twitter.com/FeR4fd2zZ5
— NASA (@NASA) March 14, 2018