Home తాజా వార్తలు హెచ్‌సిఎల్ టెక్ అదుర్స్

హెచ్‌సిఎల్ టెక్ అదుర్స్

HCL Tech Q2 Net Profit Up 18.5%

 

 

క్యూ2లో 18.5 శాతం పెరిగిన నికర లాభం

న్యూఢిల్లీ : రెండో త్రైమాసిక ఫలితాల్లో (జులై-సెప్టెంబర్) ఐటి సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.3,142 కోట్లతో 18.5 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.2,651 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.18,594 కోట్లతో 6.1 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 17,528 కోట్లు అంటే ఈసారి మంచి వృద్ధిని నమోదు చేసింది.

త్రైమాసికం త్రైమాసికం ఆధారంగా చూస్తే తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ జూన్) సంస్థ నికర లాభం రూ.2,925 కోట్లు. దీంతో పోలిస్తే 7.4 శాతం వృద్ధిని కంపెనీ చూసింది. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సిఇఒ సి.విజయకుమార్ మాట్లాడుతూ, కరెన్సీ పరంగా 4.5 శాతం రెవెన్యూ వృద్ధితో క్యూ2లో రాణించామని, 21.6 శాతం ఎబిట్ మార్జిన్ వచ్చిందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202021) ప్రతి ఈక్విటీ షేరుకు రూ.4 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు అంగీకరించింది.

HCL Tech Q2 Net Profit Up 18.5%