Home తాజా వార్తలు హెచ్‌సియులో ఉద్రిక్తత

హెచ్‌సియులో ఉద్రిక్తత

HCU-VC-Appa-Raoహైదరాబాద్: నగరంలోని హెచ్‌సియులో మంగళవారం మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్నా క్యాంపస్… విసి అప్పారావు రాకతో  ఒక్కసారిగా వేడెక్కింది. పిహెచ్‌డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత క్యాంపస్ వీడిన విసి, దీర్ఘకాలిక సెలవులు ముగించుకోని మంగళవారం మళ్లీ విధులకు హాజరవ్వడం ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు విసి బంగ్లా వైపు దూసుకెళ్లారు. అప్పారావుకు వ్యతిరేకంగా “కిల్లర్ విసి గోబ్యాక్” అంటూ నినాదాలతో హోరేత్తించారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను అడ్డుకున్నారు.