Home తాజా వార్తలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంసిఎల్‌ఆర్ 0.10% తగ్గింపు

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంసిఎల్‌ఆర్ 0.10% తగ్గింపు

HDFC Bank

 

న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి వడ్డీ రేట్లను 0.10 శాతం తగ్గించింది. గృహ కొనుగోలుదారులకు శుభవార్త వినిపించింది. కొత్త రేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. రేట్ల జాబితాను బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. రుణ రేటు (ఎంసిఎల్‌ఆర్) ఆరు నెలలకు 5 బేసిస్ పాయింట్ల తగ్గించడం ద్వారా 8.1 శాతానికి చేరింది. బ్యాంక్ ఎంసిఎల్‌ఆర్‌ను రెండేళ్లు, మూడేళ్లు కాలానికి తగ్గించింది. అయితే ఒక రోజు, ఒక నెల, మూడు నెలల ఎంసిఎల్‌ఆర్‌లో బ్యాంక్ ఎలాంటి మార్పులు చేయలేదు. అంతకుముందు ఆగస్టులో బ్యాంక్ ఎంసిఎల్‌ఆర్‌ను మార్చింది. ఆర్‌బిఐ ఇప్పటివరకు 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని తరువాత అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు బ్యాంకులు అంతగా తగ్గించలేదు. ఎంసిఎల్‌ఆర్ నుంచి రెపో రేటును అనుసంధానించాలని ఆర్‌బిఐ బ్యాంకులకు సూచించింది. ఎస్‌బిఐ, సెంట్రల్ బ్యాంక్ తమ రుణ రేట్లన్నింటినీ రెపో రేటుతో అనుసంధానించాయి.

HDFC Bank cuts lending rates by up to 0.10%