Saturday, April 20, 2024

పేటీఎంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

HDFC Bank partnership with Paytm

న్యూఢిల్లీ : కొబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల జారీ కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులకు విస్తృత స్థాయిలో ఆఫర్లను అందించే లక్షంతో ఈ డీల్ కుదుర్చుకోగా, దీనిలో మినేలియల్స్, వ్యాపారాల యజమానులు, వ్యాపారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రెడిట్ కార్డులను రిటెయిల్ వినియోగదారుల ప్రత్యేక అవసరాలకు తగినట్లు కస్టమైజ్ చేసేందుకు అవకాశం ఉంది. రివార్డ్, క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులకు అందిస్తోంది. కొత్త కార్డులు చిన్న వ్యాపారాలను నిర్వహించే యజమానులకూ సౌలభ్యాన్ని అందించనున్నాయి. పేటీఎం లెండింగ్ విభాగం సిఇఒ భవేశ్ గుప్తా మాట్లాడుతూ, ఈ ఒప్పందంతో పేటీఎంలో 300 మిలియన్ల కస్టమర్లు, 21 మిలియన్ల వ్యాపార భాగస్వాములకు రుణ లభ్యతను సరళతరం అవుతుందని అన్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేమెంట్స్ హెడ్ పరాగ్ రావు మాట్లాడుతూ, దేశంలో డిజిటైజేషన్‌ను వృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఈ భాగస్వామ్యాల ద్వారా ఎకో-సిస్టమ్ విస్తరించడం ద్వారా వినియోగదారులకు విభిన్నమైన అనుభవాన్ని అందించనున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News