Wednesday, April 24, 2024

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రుణాలు చౌక

- Advertisement -
- Advertisement -

HDFC Bank slashes interest rates

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రుణాల వడ్డీ రేట్లను తగ్గించింది. ఎంసిఎల్‌ఆర్(ఫండ్ మార్జినల్ కాస్ట్ బేస్డ్ వడ్డీ రేటు)ను స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. జూన్ 8 నుండి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. ఎంసిఎల్‌ఆర్ రేటు నెలవారీ వాయిదాలు, గృహ రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకారం, ఎంసిఎల్‌ఆర్‌ను ఒక రోజుకు 7.30 శాతానికి, ఒక నెల కాలానికి 7.35 శాతానికి తగ్గించారు.

ఒక సంవత్సరం ఎంసిఎల్‌ఆర్ ఇప్పుడు 7.65 శాతంగా ఉంటుంది. చాలా వినియోగదారు రుణాలు దీనికి అనుసంధానిస్తారు. మూడేళ్ల ఎంసిఎల్‌ఆర్ ఇప్పుడు 7.85 శాతంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటు తగ్గింపు తర్వాత ఇతర బ్యాంకుల ఎంసిఎల్‌ఆర్ కోతల నేపథ్యంలో హెచ్‌డిఎఫ్‌సి ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 మహమ్మారి, లాక్‌డౌన్ నుండి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్‌బిఐ మార్చి నుండి రెపో రేటును 1.15 శాతం తగ్గించింది. బ్యాంకులు ప్రతి నెల తమ ఎంసిఎల్‌ఆర్‌ను సమీక్షిస్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News