Home Default హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎస్‌ఎంఇ రుణాలు రెట్టింపు

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎస్‌ఎంఇ రుణాలు రెట్టింపు

HDFC Bank

 

న్యూఢిల్లీ: చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఇ) రంగానికి ప్రైవేటు రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు రుణాలు గత మూడేళ్లలో గణనీయంగా పెరిగాయి. ఈ రుణాలు మార్చి 2017లో రూ.74 వేల కోట్ల నుంచి 2019 డిసెంబర్‌లో రూ .1.48 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఎస్‌ఎంఎస్ 16 లక్షల కోట్ల రుణ మార్కెట్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 9 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం, 2019 జూన్ వరకు ఎస్‌ఎంఇలకు ఇచ్చిన మొత్తం రుణాలు రూ.15.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ సందర్భంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎస్‌ఎంఇలకు మొత్తం రూ .1.48 లక్షల కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) 2.7 లక్షల కోట్ల రూపాయల ఎంఎస్‌ఎంఇ రుణంతో మొదటి స్థానంలో ఉంది. ఎస్‌ఎంఐ రుణ విభాగంలో ఎస్‌బిఐకి 14 శాతం మార్కెట్ వాటా ఉంది. మార్చి 2017 నుండి 2019 డిసెంబర్ వరకు బ్యాంక్ 3 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఖాతాల సంఖ్య 30.74 లక్షల నుండి సుమారు 34 లక్షలకు పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎస్‌ఎంఇలకు రుణాలు 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 19 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం 3.4 మిలియన్ల వినియోగదారులలో 30 శాతం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని బ్యాంక్ రీజినల్ హెడ్ (బిజినెస్ బ్యాంకింగ్) సుమంత్ రాంపాల్ ఇటీవల పిటిఐకి చెప్పారు.

HDFC Bank SME loan book doubles to Rs 1.48 trillion