Home అంతర్జాతీయ వార్తలు తండ్రిని చంపి …

తండ్రిని చంపి …

Gun-Fire-Airఛార్లెస్టన్ : అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. 14 ఏళ్ల బాలుడు తన తండ్రిని కాల్చి చంపి, ఆపై సమీపంలోని స్కూలులోకాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు స్కూల్ విద్యార్థులు, ఓ టీచర్ గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కరోలినాకు చెందిన 14 ఏళ్ల బాలుడు తన తండ్రి జెఫ్రీ డెవిట్ ఓస్‌బోర్న్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఓ ట్రక్ తీసుకుని సమీపంలోని టౌన్‌విల్లె ఎలిమెంటరీ స్కూల్ మైదానంలోకి దూసుకెళ్లాడు. అక్కడ చిన్నారులపై కాల్పులు జరిపాడు. ఊహించని పరిణామంతో ఆందోళనకు గురైన టీచర్లు చిన్నారులను తీసుకుని పాఠశాల భవనంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాకముందే ఓ అగ్నిమాపక వాలంటీర్ ప్రాణాలకు తెగించి ఆ బాలుడుని పట్టుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ టీచర్ గాయపడ్డారని, ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే ఆ బాలుడు ఎందుకు కాల్పులు జరిపాడో తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఆ బాలుడిని పోలీసులు విచారిస్తున్నారు.