Home జాతీయ వార్తలు ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Head Constable Commits Suicide In Delhiఢిల్లీ:  ఓ హెడ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని లాడో సరాయ్ లో మంగళవారం జరిగింది. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాకు చెందిన సంజయ్ ఢిల్లీలోని సాకేత్ పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఆయన తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంజయ్ అన్నకు ఆరోగ్యం బాగుండడం లేదని, ఈ విషయమై సంజయ్ ఎప్పుడూ బాధపడుతుండేవాడని ఆయన తోటి సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలోనే సంజయ్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.