Home తాజా వార్తలు విద్యార్థినులపై అత్యాచారం కేసులో హెడ్మాస్టర్‌కు 21ఏళ్ల జైలు

విద్యార్థినులపై అత్యాచారం కేసులో హెడ్మాస్టర్‌కు 21ఏళ్ల జైలు

Headmaster jailed for 21 years for raping students

 

మన తెలంగాణ/కొత్తగూడెం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఒక గ్రామంలోని పాఠశాల విద్యార్థినులపై అత్యాచారం కేసులో అదే పాఠశాలకు చెందిన హెచ్‌ఎంకు 21 ఏళ్ల కారాగారశిక్ష, రూ.11 వేలు జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్డి మొహమ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం తీర్పునిచ్చారు. గత ఏడాది డిసెంబర్ 15న లక్ష్మీదేవిపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదైన క్రైం కింద పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదైంది. నిందితుడు ఆ పాఠశాల హెచ్‌ఎం దొడ్డా సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ఎస్‌ఐ కొంపెల్లి అంజయ్య ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం అప్పటి కొత్తగూడెం ఇంచార్జి డిఎస్పీ, ఐపిఎస్ అధికారి డాక్టర్ వినిత్ విచారణాధికారిగా వ్యవహరించారు. కోర్టు డ్యూటీ అధికారుల సహాయంతో నిరంతం కేసు వివరాలు పరిశీలిస్తూ, ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా కృషి చేశారు.

నిందితుడికి 21 ఏళ జైలు శిక్షణ, రూ.11వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి అతి తక్కువ సమయంలో శిక్షణ పడేలా కృషి చేసిన ఐపిఎస్ అధికారి డాక్టర్ వినిత్‌ను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. పురుషోత్తం, కొత్తా వెంకటేశ్వర్లు, ఏపిపి ఫణికుమార్, చంచుపల్లి సిఐ గురుస్వామి, ఎస్‌ఐ అంజయ్య కోర్ట్ డ్యూటి ఆఫీసర్ రాము వీరబాబు, హరగోపాల్‌లను జిల్లా ఎస్పీ సునీల్‌దత్ అభినందించారు. ఇదిలా ఉండగా పాఠశాలలో మొత్తం ఐదుగురిపై పాఠశాలలో అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది. మొత్తం 10 మంది నిందితులు కాగా ప్రధాన నిందితుడిగా హెచ్ ఎం దొడ్డా సునీల్ కుమార్‌పై నేరం రుజువైంది. మిగతా తొమ్మిది మంది నిందితులపై కేసు కొట్టివేశారు.

పోక్సోయాక్టులో 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా, చంపుతానని బెదిరించినందుకు ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారు. కాగా హెచ్‌ఎం ఆన్‌లైన్ క్లాస్ పేరుతో విద్యార్థినులను పాఠశాలకు పిలిపించి అత్యాచారం చేసిన ఘటనను బయటకు రాకుండా పలువురు పంచాయతీ చేశారు. ఈ విషయాన్ని ‘మన తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలు ప్రచురించింది. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. దీనిపై జడ్పీటీసి మేరెడ్డి వసంత గట్టిగా పోరాడారు. మంత్రులు సత్యవతి రాథోడ్, కమిషనర్ దేవరాజ్ దివ్య, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటంబాలను పరామర్శించాలని నిర్ణయించారు. చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దయింది.

Headmaster jailed for 21 years for raping students