Home జాతీయ వార్తలు 150 మంది విద్యార్థులకు గుండు కొట్టించి…

150 మంది విద్యార్థులకు గుండు కొట్టించి…

లక్నో: జూనియర్ విద్యార్థులకు సీనియర్లు గుండు కొట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సైఫాయి మెడికల్ సైన్స్ యూనివర్సిటీలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. 150 మంది జూనియర్ విద్యార్థులకు గుండు కొట్టివ్వడమే కాకుండా క్యాంపస్ చుట్టు పరుగులు పెట్టించారు సీనియర్ విద్యార్థులు. ఈవీడియో సోషల్ మీడియాలో వైరగా మారింది. దీంతో యుపి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ వైస్ చాన్స్‌లర్ రాజ్ కుమార్ స్పందించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీనియర్లు ఎవరైన ర్యాగింగ్ పాల్పడితే వార్డెన్‌కు ఫిర్యాదు చేయాలని జూనియర్లకు సూచించారు. ర్యాగింగ్ అనేది మెడికల్ కాలేజీల్లో సాధారణంగా మారిందని, ర్యాగింగ్ శృతి మించిందని జూనియర్లు వాపోతున్నారు. భారత దేశంలో 460 మెడికల్ కాలేజీలలో 2016లో 86 కేసులు, 2017లో 171 కేసులు, 2018లో163 ర్యాగింగ్ కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 340 సెక్షన్ నుంచి 351 సెక్షన్ వరకు కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Heads of 150 Students Shaved by Seniors in UP