Home తాజా వార్తలు ఎముకలకు బలాన్నిచ్చే మునక్కాడలు!

ఎముకలకు బలాన్నిచ్చే మునక్కాడలు!

Drumsticks

 

మునక్కాయ అంటే చాలామంది ఇష్టపడతారు. వేసవిలో ఇవి బాగా కాస్తాయి. సాంబారు, పులుసు ఇలా రకరకాల కూరల్లో మునక్కాయలను వాడతాం. అంతేనా.. మునక్కాయలతో ఊరగాయ కూడా పెడతాం. మునగాకుతో బోలెడు వంటకాలు కూడా చేస్తారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మునక్కాయ, మునగ ఆకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

1. వీటిల్లో పోషకాలు బాగా ఉన్నాయి. మునక్కాయల్లో విటమిన్ సి- ఎక్కువగా ఉటుంది. జలుబు చేసినపుడు మునక్కాడల సూప్ తాగితే ఎంతో సాంత్వన పొందుతారు.
2. ఆస్తమా, బ్రాంకైటిస్, టీబీ వంటి శ్వాసకోశ సంబంధ జబ్బుల నివారణలో మునగాకు బాగా పనిచేస్తుంది.
3. ఐరన్, కాల్షియం, విటమిన్లు మునగలో బాగా ఉన్నాయి. ఎముకలకు బలం చేకూరుస్తాయి. రక్తాన్ని శుభ్రం చేస్తాయి.
4. మునక్కాయలు, ఆకులతో చేసిన వంటకాలు తినడం వల్ల ప్రసవం సులభంగా అవడంతోపాటు ప్రసవానంతర సమస్యలు కూడా తగ్గుతాయి.
5. మునగ ఆకులతో చేసిన వంటకం వల్ల బాలింతల్లో తల్లిపాలు వృద్ధిచెందుతాయి. మునగ ఆకుల్లో కాస్త ఉప్పువేసి నీళ్లల్లో ఉడికించాలి. తర్వాత అందులోని నీళ్లను వార్చేసి ఉడికిన మునగాకులో కొద్దిగా నెయ్యివేసుకుని తింటే బాలింతలకు మంచిది.

6. మునక్కాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ సుగుణాలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకవు. ముఖ్యంగా గొంతు, చర్మం, ఛాతీ ఇన్ఫెక్షన్లు దరిచేరవు. చర్మానికి సంబంధించిన ఫంగల్ సమస్యలపై కూడా బాగా పనిచేస్తాయి.
జీర్ణసమస్యలతో బాధపడేవారికి మునగ ఆకు చాలా మంచిది.
7. కలరా, జాండిస్, విరోచనాలు వంటి వాటికి చికిత్స తీసుకునేటప్పుడు ఒక చెంచా మునగ ఆకు జ్యూసులో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని కొబ్బరిబొండం నీళ్లల్లో కలిపి రోజుకు రెండుమూడుసార్లు తాగితే మంచిది.
8. మునక్కాయ పొట్టులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ జ్యూసును యాక్నే, పులిపిరులు, చర్మ సంబంధిత సమస్యలకు వాడొచ్చు.
9. మూత్రంలో మంట వంటి సమస్యలపై కూడా బాగా పనిచేస్తుంది.
10. తరచూ మునక్కాయలు, మునగ ఆకులు తినడం వల్ల అల్సర్, పెద్దపేగు ట్యూమర్లు రాకుండా నిరోధిస్తుంది. కాన్సర్ వచ్చే అవకాశాలను అడ్డుకుంటుంది.
11. గర్భాశయంపై వచ్చే కంతుల పరిమాణాన్ని తగ్గిస్తుంది.
గాల్‌బ్లాడర్ బాగా పని చేస్తుంది.
12. మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో చక్కెర ప్రమాణాలు పెరగకుండా చూస్తుంది.

Health Benefits with Drumstick