Thursday, April 25, 2024

జలమండలి ఉద్యోగుల కోసం ఆరోగ్య శిబిరాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జలమండలి ఉద్యోగులు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎండీ దానకిషోర్ తెలిపారు. బుధవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ప్రారంభి అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల క్షేమం కోసం ఏటా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని గతేడాది సైతం ఏర్పాటు చేశామని, అప్పుడు మంచి స్పందన లభించిందని తెలిపారు. బోర్డు పరిధిలో పనిచేసే ఉద్యోగులందరూ తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరాల్ని ప్రధాన కార్యాలయంతో పాటు ఎస్.ఆర్.నగర్, గోషామహల్, మారేడ్ పల్లి, పటాన్ చెరు కార్యాలయాల్లో ఆయా తేదీల్లో మొత్తం 24 రోజుల పాటు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మొత్తం 21 రకాల పరీక్షలు 

ఈ శిబిరాల్లో.. సీబీపీ, ఈసీజీ, 2డీ ఈకో, టీఎంటీ, చెస్ట్ ఎక్స్ రే వంటి వాటితో కలిపి మొత్తం 21 రకాల పరీక్షలు చేస్తారు. ఇవన్నీ రఘ్నల్ ఇన్సురెన్స్ బ్రోకింగ్ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్, హెల్త్ ఇండియా టీపీటీ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఆరోగ్య శిబిరాలు జలమండలి కార్యాలయాల్లో వివిధ దశల్లో నిర్వహిస్తారు. నేటి నుంచి శనివారం వరకు బోర్డు ప్రధాన కార్యాలయంలో, వచ్చే నెల 3 నుంచి 6 వరకు ఎస్ ఆర్ నగర్ లోని సర్కిల్ కార్యాలయంలో, 10 నుంచి 13 వరకు గోషామహల్ డిస్పెన్సరీలో, 17 నుంచి 20 వరకు మారేడు పల్లి డివిజన్ ఆఫీసులో, 24 – 27 వ తేదీ వరకు పటాన్ చెరు జలమండలి కార్యాలయంలో శిబిరాలు నిర్వహించి ఉద్యోగుల కోసం పరీక్షలు చేస్తారు. ఈ సమయంలో అందుబాటులో లేని వారి కోసం తిరిగి మే 31 నుంచి జూన్ 3 వ తేదీ వరకు బోర్డు ఆఫీసులో నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎం మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్, తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు లక్ష్మినారాయణ, రాంచంద్రారెడ్డి, నర్సింగ్ రావు, జనరల్ సెక్రటరీ జయరాజు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News