Home తాజా వార్తలు టిమ్స్‌ను సందర్శించిన మంత్రి ఈట‌ల

టిమ్స్‌ను సందర్శించిన మంత్రి ఈట‌ల

 Health Minister Eatala Rajender Inspects TIMSహైద‌రాబాద్ : గ‌చ్చిబౌలిలోని టిమ్స్ ను రాష్ర్ట వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేందర్ ఆదివారం సందర్శించి అక్కడ పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా, మందుల లభ్యతపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హై-ఎండ్ కరోనా మందులైన  రెమిడిసివిర్‌, డెక్సామెథాసోన్‌ సహా ఇత‌ర ఔష‌థాలు టిమ్స్ లో తగినంత నిల్వలు ఉన్నాయని మెడికల్ ఎడ్యుకేషన్ డైర‌క్ట‌ర్ డాక్టర్ కె. రమేష్ రెడ్డి మంత్రికి తెలిపారు. రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే, ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటల అధికారులను ఆదేశించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారినే టిమ్స్ లో చేర్చుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఈటల టిమ్స్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో   టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమల థామస్, ఇతర సీనియర్ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు.