Home వార్తలు ఇంట్లోని వస్తువులూ ఆరోగ్యానికి చేటు!

ఇంట్లోని వస్తువులూ ఆరోగ్యానికి చేటు!

Kitchen1మన తెలంగాణ/ హైదరాబాద్ : ఇంట్లో నిత్యం వాడే వస్తువులు, ఆహార పదార్థాలు అనేక రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. వేగంగా నగరీకరణ జరుగుతున్న నేపథ్యంలో వ్యాపార రంగంలో కూడా పోటీ పెరిగి తయారు చేస్తున్న వస్తువులు, పదార్థా లు ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. ఇంటి ప్రతిష్టను పెంచుతాయని, సౌకర్యవంతమైన, సుఖమయమైన జీవి తాన్ని ఇస్తాయని ఊదరగొట్టే వ్యాపార ప్రకటనల మోజు లో పడి ఇంటిని నింపేస్తున్న వస్తువులు, పదార్థాలు నగర జీవుల జీవితాలను కాటేస్తున్నాయని నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఆర్సెనిక్ అధిక శాతంగా ఉన్న నీరు మొదలు నాన్‌స్టిక్ వంట పాత్రల వరకు మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్ వంటి రోగాల రావడానికి కారణమవుతు న్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే పిల్లలకు కూడా ఇలాంటి రోగాలు బారిన పడే ప్రమాదముంది.
ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధిక మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారు. నీళ్లలో ఆర్సెనిక్ శాతం 8-10 మైక్రోగ్రామ్స్ ఉంటే మధుమేహవ్యాధి రావడానికి అవకాశముందని పరిశోధనలు తేల్చాయి. అయితే నగరంలో సరఫరా అవుతున్న నీటిలో 30 మైక్రోగ్రామ్స్ ఆర్సెనిక్ ఉన్నట్లు, అదే కాచిగూడ ప్రాంతం లో 60 మైక్రోగ్రామ్స్ ఉన్నట్లు నగరానికి చెందిన శాస్త్రీయ సంస్థలు చేసిన పరిశోధనల్లో తేలింది. దీంతో గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో మధుమేహానికి గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది. కొన్ని ప్రముఖ బ్రాండ్ల టూత్‌పేస్ట్‌లలో అవసరానికి మించి ఫ్లోరైడ్ ఉంటుంది. కాస్మోటిక్స్‌లో ఉపయోగిస్తున్న పారాబిన్స్ కెమికల్స్ కారణంగా వాటిని వాడే వారు క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలా మట్టుకు సబ్బులు, షాంపుల్లో ట్రైక్లోసిన్ రసాయనం కూడా ప్రమాదకరంగా మారు తుంది. మౌత్ ఫ్రెషనర్లలో బాక్టీరియాలను చంపే తత్వం ఉండడంతో నోటిలోని ఆరోగ్యాన్ని పాడు చేసే బాక్టీ రియాతో పాటు శరీరానికి, నోటికి అవసరమైన బాక్టీ రియాను కూడా చంపేయడంతో శరీరం నోరు, తద్వారా శరీరం అనారోగ్యం పాలవుతుంది. డియోడరెంట్‌లలో ప్లాస్టిక్ పదార్థమే కాకుండా పెట్రో కెమికల్స్‌ను కూడా వాడుతుండడంతో అవి వాడే వారి శరీరంలోకి విషం చేరి థైరాయిడ్, గర్భస్త, మెదడుపై ప్రభావాన్ని చూపుతు న్నాయి. స్కిన్ వైట్నెంగ్ గార్డ్‌లో మెర్కూరీస్ క్లోరైడ్, టాటూస్‌లో మెర్కూరీస్ క్లోరైడ్ తోపాటు ప్లాస్టిక్ కవర్లలో పోసిన వేడి టీ, ఫ్రీజ్‌లో పెట్టి శీతలీకరించిన తర్వాత ప్లాస్టిక్ కవర్లలో పోసే పాలు తాగిన వారిలో ప్లాస్టిక్ సంబంధించిన రసాయనాలు శరీరంలోకి ప్రవే శించి అనారోగ్యాన్ని తెస్తున్నాయి. ఇథనాల్ ఉన్న పర్ ఫ్యూమ్స్ వాడే వారిలో కాలేయం ఆల్కాహాల్ తీసుకునే వారి కన్నా ముందుగా పాడైపోతున్నట్లు తెలుస్తుంది. నాన్‌స్టిక్ వంట సామాగ్రి వాడే వారిలో ఆక్టానిక్ చేరి అది క్రమేణా థైరాయిడ్‌కు దారి తీస్తుంది. నాన్‌స్టిక్‌లో వాడే టెఫ్లర్‌ను కార్ల కోటింగ్‌కు వాడితే మంచిది కానీ అదే టెఫ్లర్ కోటింగ్ ఉన్న వాటిని వంటకు ఉపయోగిస్తే అది అనర్థాలకు దారి తీస్తుంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో వాడి వదిలేసిన పలు వస్తువులు, పదార్థాలు నేడు మన దేశీయ గృహ మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. కేవలం ధనా ర్జనే ధ్యేయంగా హోంనీడ్స్ రంగంలోకి ప్రవేశిం చిన పారిశ్రామికవేత్తలు పోటా పోటీగా వదులు తున్న ఈ వస్తువులు, పదార్థాలు చాపకింద నీరుగా నగర జీవి శరీరాన్ని రోగగ్రస్తంగా మరుస్తున్నాయి. అయితే వీటి ప్రభావం పడకపోవడంతో ఈ ప్రమాదాన్ని పసిగట్టలేక పోతున్నారు. సెంటర్‌ఫర్ ప్రోగ్రెసివ్ మెడిసిన్ తదితర శాస్త్రీయ సంస్థలు ఇటీవల పర్యావరణ వైద్యం పట్ల పరిశోధనలు చేయడం ద్వారా అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ప్రజలు తీసుకు నే జాగ్రత్తల కన్నా గృహోపకరణాలు, పదార్థాల తయారీ, అమ్మకం ఆరోగ్య రీత్యా అవి ఎంతవరకు క్షేమ కరమనే విషయాలపై ప్రభుత్వం నియంత్రణ పెట్టాల్సిన అవస రం కనిపిస్తుంది. పెరుగుతున్న మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్ తదితర వ్యాధులకు ఆధునిక జీవన శైలిని తెలిపే గృహోపకరణాలు, పదార్థాలు ఎంత వరకు కారణమనే విషయాలపై సరైన పరిశోధనలు జరిపి వాటిని ప్రభుత్వమే నియంత్రించాల్సిన అవసరం ఉంది.