మన తెలంగాణ, సిటిబ్యూరో: ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని టిజిఎస్‌పిఎఫ్ కమాండెంట్, ఆరోగ్యభద్రత సెక్రటరీ ఎన్. త్రినాథ్ అన్నారు. టిజిఎస్‌పిఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో బుద్ధభవన్‌లో మంగళవారం ఆరోగ్య భద్రత సదస్సు నిర్వహించారు. సిబ్బందికి కంటి పరీక్షలు ,పంటి పరీక్షలు నిర్వహించారు. యశోదా ఆస్పత్రి, శ్రీ నేత్రాలయ ,సౌజన్య డెంటల్ ఆస్పత్రుల వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ ఎన్.త్రినాథ్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు ప్రతి రోజు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం వ్యాయామం, నడక, యోగాతో పాటు శారీరక శ్రమ కలిగించే పనులు చేయాలని పిలుపునిచ్చారు. సిబ్బంది ఆరోగ్య భద్రత లో భాగస్వాములైన ఆస్పత్రులను త్రినాథ్ అభినందించారు. డాక్టర్ సందీప్ తుల క్యాన్సర్ పైన సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ జంగయ్య, అసిస్టెంట్ కమాండెంట్ బాబురావు,ఇన్స్‌స్పెక్టర్లు సన్యాసిరావు, ఎస్సై, ఎఎస్సైలు పాల్గొన్నారు.