Wednesday, April 24, 2024

కోవిడ్ వచ్చి కోలుకున్న గుండె జబ్బుల ప్రభావం

- Advertisement -
- Advertisement -

Heart problems after covid 19 recovery

ఎక్కువగా 50 ఏళ్లలోపు యువకులే హార్ట్ ఎటాక్ గురి
ప్రతి రోజు వ్యాయామం, రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి
ఒత్తిడికి గురికాకుండా, మంచిగా నిద్రపోవాలి
అంతర్జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా వైద్యుల సూచనలు

హైదరాబాద్: మనిషి జీవితంలో అతి ముఖ్యమైన అవయవం గుండె.. ఇది పని చేయకపోతే మనం లేనట్టే. అందుకోసం గుండె జబ్బుల పట్ల అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం రక్షించుకోవడానికి అనేక నియమాలు పాటించాలి. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ విజృంభణతో అనేక మంది మరణించారు. కోవిడ్ వచ్చి కోలుకున్న తరువాత కూడా అనేక లక్షలమంది వివిధ రోగాల బారీన పడుతున్నారు. కొంతమందిపై గుండెపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన అంతర్జాతీయ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈసందర్బంగా గుండె వ్యాధులు పట్ల, శస్త్రచికిత్సల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వైద్యులు అవగాహాన కల్పిస్తున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు డా. నిస్గర వెల్లడించారు.

కోవిడ్ తరువాత గుండె జబ్బులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో గుండె సమస్యలు ఉన్న వారు అధికంగా భయపడుతున్నారు. గుండె సమస్యలు ఉన్నవారు ఈతరుణంలో ఎలా ఉండాలి అనే అంశాలపై సూచనలు చేస్తున్నారు. గుండె వ్యాధి సమస్యలున్న వారికి కరోనా సోకితే ఇతరుల కన్నా తీవ్రంగా ఉంటాయని, వైరస్ ఇన్‌సప్లమెంటరీ ప్రభావం ఆధారంగా వైరల్ సంక్రమణ కోరోనరీ ధమనులతో అథెరోస్కెరోటిక్ ఫలకాలు చీలిపోవడానికి కారణమయ్యే సైద్దాంతిక ప్రమాదాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది తీవ్రమైన కొరోనరీ సిండ్రోమ్స్‌కు దారితీస్తుంది. కరోనా లక్షణాలు కనిపిస్తున్న సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తే వెంటనే ఆరోగ్య సంరక్షణ సలహా బృందానికి కాల్ చేయాలంటున్నారు. తీవ్రమైన దైహిక ఇన్‌సప్లమెంటరీ పరిస్దితులు అరిథ్మియాను తీవ్రతరం చేస్తాయని, కొంతమంది వ్యక్తులలో కర్ణిక దడను ప్రేరేపిస్తాయి.

కోవిడ్ వ్యాధి ఉద్భవించిన చైనా నుండి వచ్చిన డేటా ప్రకారం వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారిలో గణనీయమైన నిష్పత్తిలో మధుమేహం, రక్తపోటు వంటి కొమొర్బిడిటీలు ఉన్నాయని సూచిస్తున్నారు. దీనికి ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది, సాధారణ జనాభాలో రక్తపోటు, మధుమేహం రెండు ప్రబలంగా ఉంటాయి. కోవిడ్ సంక్రమణ నుంచి మరణాలు ఎక్కువగా ఉన్న వయస్సులో ఉన్న వారే అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే సాధారణ మందులైన యాంజియోటెన్సిన్ కన్‌వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్న్, యాంజియోటేన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ వాడకంతో ఈపరిశీలనను అనుసంధానం ఒక కథనం ఉందన్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్న రోగుల పురోగతిని పర్యవేక్షించేటప్పడు యూరోపియన్ సొసైటీ ఆప్ కార్డియాలజీ ఈమందులను కొనసాగించాలని సిఫారు చేస్తున్నాయి.

కోవిడ్ నుంచి కోలుకున్న వారికి సూచనలు

Heart problems after covid 19 recovery

గుండె వ్యాధి సమస్యలు ఉన్నవారు కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత వైద్యులను సంప్రదించడం ముఖ్యం.
ప్రతి రోజు వ్యాయామాలు చేయాలని, రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి.
పౌష్టికాహారం, కొవ్వు పదార్దాలులేని ఆహారం తీసుకోవడం ఉత్తమం.
ధూమపానం, మద్యపానం తీసుకోరాదు. ఒత్తిడికి గురికాకుండా మంచిగా నిద్రపోవాలి.

పుట్టుకతోనే గుండె జబ్బులు రావడానికి కారణాలు

నియంత్రణలేని రక్తపోటు, మధుమేహం, కొవ్వు, అధికంగా ధూమపానం చేయడం, మద్యపానం, ఉబకాయం,ఎప్పడు కూర్చొని పనిచేయడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News