Home తాజా వార్తలు అమిత్‌జీ త్వరగా కోలుకోవాలి

అమిత్‌జీ త్వరగా కోలుకోవాలి

hearty prayers with you Amit ji: chiranjeevi

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కి, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్ అని తేలగానే అటు అభిమానులు సహా ఇటు సెలబ్రిటీలు ఎంతో ఆందోళన చెందారు. ముఖ్యంగా అమితాబ్‌కి ఎంతో సన్నిహితుడైన మెగాస్టార్ చిరంజీవి వెంటనే ట్విట్టర్ లో స్పందించారు. అమిత్‌జీ త్వరగా కోలుకోవాలని చిరంజీవి ప్రార్థించారు. “ఆల్ అవర్ బెస్ట్ విషెస్ అండ్ హార్టీ ప్రేయర్స్ విత్ యు అమిత్‌జీ.. సీనియర్ బచ్చన్ గెట్ వెల్ సూన్‌” అంటూ ట్వీట్ చేశారు. ఇక చిరుతో అమితాబ్ సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఓవైపు 76 ఏళ్ల వయసులో తన ఆరోగ్యం సహకరించకపోయినా చిరు కోరిక మేరకు అమితాబ్ ‘సైరా’ చిత్రంలో నటించారు.

ఇక అమితాబ్‌కు కరోనా సోకిందని తెలియడంతో పవన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా పవన్ గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. పవన్, చిరు, వాళ్ల అమ్మా నాన్న అప్పట్లో ‘కూలీ’ మూవీ షూటింగ్‌లో అమితాబ్ ప్రమాదానికి గురైతే త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధించారట. అమితాబ్ టాలెంట్ తో పాటు, పోరాటతత్వం, దయాగుణం, ఆత్మస్థైర్యం నాకు బాగా నచ్చిన అంశాలు అని చెప్పిన పవన్.. అమితాబ్, అభిషేక్‌లు ఆసుపత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నారు.

hearty prayers with you Amit ji: chiranjeevi