Saturday, April 20, 2024

వైద్య సేవకురాలిగా నైట్

- Advertisement -
- Advertisement -

Heather Knight

 

లండన్: కరోనా బాధితుల సహాయం కోసం ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హిథర్ నైట్ వైద్య సేవకురాలి అవతారమెత్తింది. కరోనా కోరల్లో చిక్కుకున్న ప్రజలకు అండగా నిలిచేందుకు నైట్ వైద్య వాలంటీర్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సేవలు అందించడం కంటే మరో ఉత్తమమైనది ఏదీ లేదని నైట్ పేర్కొంది. తమ జాతీయ ఆరోగ్య సంస్థలో వాలంటీర్‌గా విధులు నిర్వహించేందుకు తాను సిద్ధమయ్యానని తెలిపింది. ఈ క్రమంలో కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండి వారికి తగిన సేవలు చేయడమే తన ఏకైక కర్తవ్యమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా భయపడేది లేదని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ టోర్నీలన్నీ రద్దయ్యాయని, ఇలాంటి సమయంలో దేశానికి సేవ చేసే అవకాశం తనకు దొరికిందని చెప్పింది.

 

Heather Knight as medical assistant
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News