Thursday, April 25, 2024

శ్రీశైలానికి జలకళ

- Advertisement -
- Advertisement -

Heavt Flood water reached Krishna River

 కృష్ణా నదికి వరద యధాతథం
 శ్రీశైలంకు 88వేల 316క్యూసెక్కుల వరద
 885అడుగులకు గాను 849అడుగులకు చేరుకున్న నీటి మట్టం
 అలమట్టి,నారాయణపూర్‌లకు నిలకడగా వరద
 భారీ వర్ష సూచనతో వరద పెరిగే సూచనలు
 జూరాల, తుంగభద్ర, శ్రీశైలంకు తగ్గని వరద
మనతెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి : కృష్ణానది పొంగుతుండడంతో ఆ బేసిన్‌లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకన్నది. 5,10క్యూసెక్కుల స్వల్ప హెచ్చుతగ్గులతో వరద యధాతధంగా కొనసాగుతుండడంతో ప్రాజెక్టులలోకి నీరు చేరుతుండగా ఇన్‌ఫ్లోను ఆధారం చేసుకుని ప్రాజెక్టులలో ఏ మేరకు నీరు నిల్వ ఉంచాలో నిర్ధారించి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కష్ణా నదికి వరద ప్రవాహం స్థిరంగా ఉండడంతో తెలంగాణ ప్రాజెక్టులలో అధికారులు క్రమ పద్ధతిలో ఏ ప్రాజెక్టుకు ఏ మోతాదులో నీటిని వదలాలి, ఏ మేరకు విద్యుత్తు ఉత్పత్తి చేపట్టాలో అంచనాల మేరకు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా నదిపై ఆధారపడిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో పాటు జూరాల కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి, మూడు క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల, సుంకేసుల,హాంద్రీనీవాల నుంచి శ్రీశైలం జలాశయానికి 88వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది.దీంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థం 885అడుగులకు గాను 849అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దిగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని అలమట్టి, నారాయణపూర్‌లకు 50 నుంచి 45వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. తెలంగాణలోని దిగువ జూరాలకు 65వేల 791క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయ్యింది. జూరాల జలవిద్యుత్తు ఎగువ, దిగువ కేంద్రాల ద్వారా 5యూనిట్లతో విద్యుత్తు ఉత్పత్తి చేసి దిగువ శ్రీశైలంకు 36వేల 461క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల మూడు గేట్లను ఎత్తి 12వేల 480క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదే విధంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1500క్యూసెక్కులు, భీమా మొదటి లిఫ్టు ద్వారా 650క్యూసెక్కులు, భీమా రెండవ లిఫ్టు ద్వారా 750క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా 315క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. అదే విధంగా జూరాల కుడి ఎడమ కాలువల ద్వారా 1114క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

అదే విధంగా సమాంతర కాలువ ద్వారా 800క్యూసెక్కుల చొప్పున జూరాల ప్రాజెక్టు ద్వారా మొత్తం 53వేల 757క్యూసెక్కుల వరద జలాలను జూరాల నుంచి ఎత్తిపోతలు, దిగువ శ్రీశైలంకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 68వేల 181క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది. జూరాల మూడు క్రస్టు గేట్ల ద్వారా 12వేల 375క్యూసెక్కులు, విద్యుత్తు ఉత్పత్తి ద్వారా 36వేల 461క్యూసెక్కులు తుంగభద్రా నదిపై ఉన్న సుంకేసుల బ్యారేజీ ద్వారా 4379క్యూసెక్కులు, హాంద్రీనీవా ద్వారా 3750క్యూసెక్కుల చొప్పున వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం జల విద్యుత్తు ఎడమ గట్టు కేంద్రం ద్వారా 38వేల 140క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. తుంగభద్రకు 14వేల 285క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వివిధ సోర్సుల ద్వారా మొత్తం 88వేల 316క్యూసెక్కుల వరద చేరుతుంది. నాగార్జునసాగర్‌కు ఎగువ శ్రీశైలం నుంచి 34వేల 256క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా పులిచింతల కృష్ణా డెల్టా సిస్టంకు వరద నీటిని వదులుతున్నారు. భారీ వర్షాలతో రెండు మూడు రోజులలో కృష్ణా బేసిన్‌కు వరద ప్రవాహం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Heavt Flood water reached Krishna River

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News