Friday, March 29, 2024

రహదారులపై ధాన్యం ఆరబోస్తే భారీ జరిమానా..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల రహదారులపై జరుగుతున్న అనేక ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రహదారులు, జాతీయ రహదారులపై అదేవిధంగా వంతెనలపై ఎలాంటి దాన్యం ఆరబోసినా… సంబంధిత రైతుపై కేసు నమోదు చేయడంతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించాలని తెలిపింది. సంబంధిత శాఖ ఈ జరిమానా విధిస్తుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

ఆరపోసినధాన్యం వల్ల రోడ్డు ప్రమాదంలో వాహనదారులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం చెందినా వాహనానికి సంబంధించిన బీమా డబ్బులు బాధిత వ్యక్తులకు అందజేయబడుతుంది. ప్రమాదానికి కారకుడైన ధాన్యం ఆరబోసిన రైతు నుండి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ఆస్తి జప్తి చేసి బాధిత ప్రమాద వ్యక్తులకు అందజేస్తారు. అన్నదాతలు ఇలాంటి ఇబ్బందులు కలిగే సంఘటనలకు కారణమైన రహదారులు, జాతీయ రహదారులపై దాన్యం ఆరపోయకుండా జాగ్రత్తగా ఉండాలని భారత అత్యున్నత ధర్మాసనం అన్నదాతలకు సూచించింది. ఈ సంఘటనలు తీవ్రమైన పరిణామాలని, వీటిపై సంబంధిత శాఖ అధికారులకు దృష్టి పెట్టకపోవడం శోచనీయమని అధికారులను మందలించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News