Wednesday, April 24, 2024

గీత దాటితే తాటతీస్తున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

Heavy fines on motorists in Cyberabad

సైబరాబాద్‌లో వాహనదారులపై భారీగా జరిమానాలు
గత ఏడాది రూ.57,59,70,540 ఫైన్లు చెల్లింపు
14,95,307 కేసులు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారుల పట్ల సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేయడంతోపాటు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. గత ఏడాది జనవరి1వ తేదీ నుంచి డిసెంబర్ 10,2020 వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి రూ..57,59,70,540 జరిమానాలు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు 14,95,307 కేసులు నమోదు చేశారు. గత ఏడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు వాహనదారులకు 182,31,08,730 రూపాయల జరిమానా విధించారు. గత ఏడాది సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 48,35,764 కేసులు నమోదు చేశారు.

మే నెలలో అత్యధికంగా 6,89, 449 కేసులు నమోదు చేశారు. వాహనాదారులు లాక్‌డౌన్ సమయంలో కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ చలాన్లలో ఎక్కువగా హెల్మెట్‌కు సంబంధించనవే ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో బైక్ నడిపే వారికి మాత్రమే హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధన ఉండేది. అది ఇప్పుడు బైక్ వెనుక కూర్చును వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధన విధించడంతో చాలామందికి జరిమానాలు విధిస్తున్నారు. సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్‌లో వాహనం నడిపినా,హెల్మెట్ పెట్టుకోకున్నా, కార్ల వారు సీటు బెల్ట్ పెట్టుకోకున్నా జరిమానా విధిస్తున్నారు. మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారి పట్ల మాత్రం మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు, వారి లైసెన్స్‌లు రద్దు చేసేందుకు సిఫార్సు చేయడమే కాకుండా భారీగా జరిమానా విధిస్తున్నారు.

మెసేజ్‌లతో అలర్ట్…

నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుడికి వెంటనే ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడమే కాకుండా వారిని ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వెంటనే వాహనాలపై ఉన్న జరిమానాలు కట్టాలని లేకుండా వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మూడు చలాన్లకంటే ఎక్కువగా ఉన్న వాహనాలను జప్తు చేస్తామని వారికి సమాచారం ఇస్తున్నారు. దీంతో చాలామంది వాహనదారులు డబ్బులు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు తరచూ తనిఖీలు చేస్తుండడంతో ఆ సమయంలో ఆయా వాహనాలపై ఉన్న చలాన్లను తనిఖీ చేస్తున్నారు. పెండింగ్ చలాన్లు కట్టిన తర్వాతే వాహనదారులను వదిలేయడంతో చాలామంది జరిమానాలు చేల్లిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News