Friday, April 19, 2024

శ్రీశైలంకు భారీ వరద

- Advertisement -
- Advertisement -

heavy flood to srisailam dam

2 లక్షల 50వేల 680 క్యూ. ఇన్‌ఫ్లో
శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత
జూరాలకు లక్షా 51వేల క్యూ. ఇన్‌ఫ్లో, 17 గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్ 12 గేట్లు ఎత్తివేత

నాగర్‌కర్నూల్ : శ్రీశైలం జలాశయానికి శుక్రవారం 2లక్షల 50వేల 680 క్యూసెక్కుల భారీ వరద వస్తుంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి భారీ స్థాయిలో వరద వస్తుండడంతో శ్రీశైలం జలాశయం 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు 2లక్షల 23వేల 128 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరో 31వేల 639 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువ నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. నాగార్జునసాగర్ 12 గేట్లను ఎత్తి దిగువకు 2లక్షల 13వేల 34క్యూసెక్కుల నీటిని దిగువ పులిచింతలకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల 17గేట్లు ఎత్తి లక్షా 24వేల 317 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రం ద్వారా మరో 31వేల 639 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. తుంగభద్ర డ్యాం ద్వారా 36వేల 922 క్యూసెక్కుల నీటిని వదులుతుండడంతో గద్వాల జిల్లా రాజోలిలోని సుంకేసుల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు 72వేల 628 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కర్ణాటకలోని అలమట్టి ద్వారా 59వేల 860 క్యూసెక్కుల నీటిని దిగువ నారాయణపూర్‌కు వదులుతుండగా నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 87వేల 119 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

కృష్ణా బేసిన్‌లో నీటినిల్వ ఇలా..

కృష్ణా బేసిన్‌లోని కర్ణాటక రాష్ట్రంలో గల అలమట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 129.72 టిఎంసీలకు గాను 127.65 టిఎంసీలుగా నమోదయ్యింది. అదే విధంగా నారాయణపూర్ పూర్తి స్థాయి నీటిమట్టం 37.64 టిఎంసీలకు గాను 36.88 టిఎంసీలుగా నిల్వ ఉంది. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.459 టిఎంసీలకు గాను 5.752 టిఎంసీలుగా నమోదయ్యింది. అదే విధంగా శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 215.807 టిఎంసీలకు గాను శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 214.8450 టిఎంసీలుగా నమోదయ్యింది. అడుగులలో మొత్తం 885 అడుగులకు గాను 884.80 అడుగుల నీరు నిల్వ ఉంది. అదే విధంగా నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థం 312.045 టిఎంసీలకు గాను 309.06 టిఎంసీలుగా నమోదయ్యింది.

అడుగులలో 590 అడుగుల సామర్థానికి గాను 589.90 అడుగులుగా పూర్తి స్థాయి నీటి నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థం 45.77 టిఎంసీలకు గాను 45 టిఎంసీల నీరు నిల్వ ఉంది. అదే విధంగా కృష్ణా డెల్టా బేసిన్‌లో 3.07 టిఎంసీల సామర్థానికి గాను 3.07 టిఎంసీలతో నిండుకుండలా ప్రాజెక్టు ఉంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలోని తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి సామర్థం 100.86 టిఎంసీలకు గాను 100.09 టిఎంసీల మేర నీరు నిల్వ ఉంది. వరద భారీగా వస్తుండడంతో దిగువ సుంకేసులకు 70వేల టిఎంసీల నీటిని వదులుతున్నారు. కృష్ణా తుంగభద్ర నదులకు వరద పొటెత్తుతుండడంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తి ఇన్‌ఫ్లో ఆధారంగా దిగువకు నీటిని వదులుతున్నారు. వచ్చే 4 రోజుల పాటు వరద ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News