Home తాజా వార్తలు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

Heavy Flood Water Inflow To Godavari Riverభద్రాద్రి కొత్తగూడెం : ఎగువన కురుస్తున్న వర్షాలతో  భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది. ప్రస్తుతం గోదావరిలో 43.8 అడుగులకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదారిలో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు  హెచ్చరించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నందున నిరంతరం వరద పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.