Home తాజా వార్తలు సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద ప్రవాహం

సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద ప్రవాహం

Heavy Flood Water Inflow To Singur Projectసంగారెడ్డి : పుల్కల్ మండల పరిధిలోని సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టుకు మళ్ళీ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర నుంచి భారీగగా వరద నీరు వస్తుండడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 29,677 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా,  ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిలువ 29.618 టీఎంసీలుగా ఉంది. భారీగా వరదనీరు వస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్న మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.