Home Default సింగూరు ప్రాజెక్ట్ కు భారీ వరద

సింగూరు ప్రాజెక్ట్ కు భారీ వరద

Heavy Flood Water Inflow To Singur Projectసంగారెడ్డి : పుల్కల్ మండల పరిధిలోని సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్  లోకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ లోకి 32, 964 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తి 29, 677 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917.టీఎంసీలు కాగా,  ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి సామర్థ్యం 29.678 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.