Home తాజా వార్తలు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

Heavy flood water inflow to Sriramsagar projectనిజామాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టులోకి 61,310 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ క్రమంలో  అధికారులు ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1,24,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 7500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను,  ప్రస్తుతం 1090.5 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలకుగాను 87.561 టీఎంసీలు ఉంది. భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం నీటమునిగింది.