Home జాతీయ వార్తలు తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Heavy Flood Water Inflow To Tungabhadra Projectజోగులాంబ గద్వాల  : కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు బారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. శనివారం ఈ ప్రాజెక్టుకు 1,02,048 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరింది. అవుట్ ఫ్లో 5,214 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 71.721 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 1624.42 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ప్రాజెక్టు సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలతో తుంగ‌భ‌ద్ర‌ ప్రాజెక్టుకు మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.