Saturday, April 20, 2024

మూసీకి భారీ వరద

- Advertisement -
- Advertisement -

Heavy Flood Water To Musi River

పొంగుతున్న గోదావరి, నీటి ముట్టడిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు
హైదరాబాద్‌లోని మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనలపై రాకపోకలు
నిలిపివేత సిరిసిల్ల కలెక్టరేట్‌లోకి భారీగా వరద నీరు, రాత్రి ఆఫీసులోనే బస
చేసిన జిల్లా కలెక్టర్ మంగళవారం ట్రాక్టర్ సాయంతో బయటకు రాక
పలు జిల్లాల్లో వాగులు దాటే యత్నంలో ఇబ్బందులకు గురైన వాహనదారులు
గగన్‌పహాడ్ వద్ద బెంగళూరు హైవేపై అలుగు పారుతున్న అప్పాచెరువు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వైపు వెళ్లే వాహనాల దారి మళ్లింపు ఒఆర్‌ఆర్
మీదుగావెళ్లాలని ఆదేశాలు, శంషాబాద్‌హైదరాబాద్ రోడ్డులో రాకపోకలు
యథాతథం, నిజామాబాద్ జిల్లాలో 232 మి.మీ. వర్షం
వికారాబాద్ జిల్లా ఆనంతగిరి
అడవుల్లో కురిసిన వర్షాలతో
మూసీ నదికి ఉధృతంగా వరద
గరిష్ట స్థాయికి
హిమాయత్‌సాగర్,
ఉస్మాన్‌సాగర్ జలాశయాలు,
గేట్లు ఎత్తివేత హైదరాబాద్,
రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి
జిల్లాల పరిధిలో పొంగి
ప్రవహిస్తున్న మూసీ నది
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
వంతెనలను తాకుతున్న మూసీ
మొదటి ప్రమాద హెచ్చరిక
జారీ జియాగూడ వద్ద మూసీ
ఉగ్రరూపం
Heavy Flood Water To Musi River

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో భారీవర్షాలకు వాగులు వంకలు పోటేత్తాయి. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో కురిసిన వర్షాలతో మూసినది ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ , ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లోకి వదరనీరు భారీగా చేరుకోవటంతో ఈ రెండ జలాశయాల్లో నీటిమట్టాలు గరిష్ట స్థాయికి చేరాయి. అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని జంట జలాశయాల గేట్లు ఎత్తి వేసి ఎగువ నుంచి వస్తున్న నీటిని వస్తున్నట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నారు.దీంతో హైదరాబాద్ , రంగారెడ్డి , యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలో మూసినది పొంగి ప్రవహిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసినది వరద నీరు వంతెనలను తాకుతూ ప్రవహిస్తోంది.ఎగువ నుంచి మూసినదికి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఇప్పటికే అధికారులు పొంచివున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా నగరంలోని మూసారాంబాగ్ , చాదర్‌ఘాట్ వంతనల మీదుగా రాకపోకలను నిలిపివేశారు. కిషన్ బాగ్ , చాదర్‌ఘాట్ , శంకర్ నగర్ , ఓల్డ్ మలక్ పేట్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.కియాగూడ వద్ద మూసినది ఉగ్రరూపం దాల్చింది. మూసి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరదనీరు చేరుతోంది. మూసి రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 4.46టిఎంసిలు కాగా ,ఇప్పటికే ఈ రిజర్వాయర్‌లో 74శాతం నీరు నిలువ ఉంది. ఎగువనుంచి 14,309క్యూసెక్కుల నీరు వస్తుండగా , ప్రాజెక్టు గేట్లు తెరిచి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పొంగుతున్న గోదావరి.. ఉపనదులు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి, దాని ఉప నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంజీరా నది వరదనీటితో ఒడ్డులోరుసుకొని ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 45,595క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, ముందు జాగ్రత్త చర్యల కింద రిజర్వాయర్ నుంచి 65,966క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. ఎగువ నుంచి 44,700క్యూసెక్కుల నీరు చేరుతుండగా అధికారులు వరద ప్రవాహాన్ని నియంత్రిస్తూ దిగువకు 72,200క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ దిగువన మంజీరా నది పరివాహకంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

శ్రీపాద ఎల్లంపల్లికి వదరపోటు :

గోదావరితోపాటు దాని ఉపనదుల ద్వారా భారీగా వరదనీరు చేరుతుండటంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వదర పోటెత్తింది. ఎగువన శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 2,90,000క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్లు ఎత్తి 4,12,445క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కడెం నదికూడా ఉధృతరూపం దాల్చింది. కడెం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 20,862 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 17,400క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. అటు ప్రాణహిత నదినుంచి కూడా భారీగా వరదనీరు చేరుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 7,32,522క్యూసెక్కలు వరదనీరు చేరుతోంది.ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి 7,24,800క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 18,508క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది. దిగవ మానేరు ప్రాజెక్టులోకి 1,06,984క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టునుంచి 1,66,989 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.

నిలకడగా కృష్ణాప్రవాహం

కృష్ణానదిలో వరద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు 55,000క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఈ ప్రాజెక్టు నుంచి 59,533 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి40,627క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 73,485క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 68,174 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 57,799 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 73,076 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, దిగువకు 60,854క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

మహారాష్ట్ర నుంచి వరద హెచ్చరిక

సింగూర్ ప్రాజెక్ట్ పై ఉన్న ధనేగావ్ ప్రాజెక్ట్ డ్యామ్ గేట్లను మంగళవారం రాత్రి అధికారులు తెరిచి దాదాపు 80,000 క్యూసెక్కుల నీటిని మంజీరా నదికి విడుదల చేశారు. బుధవారం లోగా సింగూర్ ప్రాజెక్ట్ నుంచి మరో 80,000 క్యూసెక్కులు లేదా అంతకంటే ఎక్కువ వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో సింగూర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న మంజీర నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా, నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేశారు.

చెరువులు తనిఖీ చేయండి: రజత్ కుమార్

గులాబ్ తుపాను కారణంగా రాష్ట్ర మంతటా తలెత్తిన పరిస్థితులపై మంగళవారం నాడు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆ శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీవర్షాల హెచ్చరికల నేపధ్యంలో అధికార యంత్రాగం పూర్తి అప్రమత్తంగా ఉంటూ అన్ని విధాల సిద్దంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని చెరువులు కుంటల పంటల పరిరక్షణ కోసం సీనియర్ ఇంజనీర్లతో 15ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో ఇంజనీర్లు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల వల్ల చెరువులు , కుంటలకు గట్లు బలహీనంగా ఉన్న చోట గండ్లు పడితే వెంటనే వాటిని పూడ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నీటివనరుల రిపేర్లకోసం ఇంజనీర్లు తమకు ఉన్న ఆర్ధిక అధికారాలను వినియోగించుకోవాలన్నారు. నీటిపారుదలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు వెంటనే కంట్రోల రూం నంబర్ 04023390794కు ఫోన్ చేయాని కోరారు.

పరిరక్షణకు 15 ప్రత్యేక బృందాలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించేందుకు సీనియర్ ఇంజనీర్ల నేతృత్వంలో 15ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ రజత్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో మొత్తం 185 చెరువులు ,కుంటల పరిరక్షణ కోసం ఈ బృందాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News