Home తాజా వార్తలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు భారీగా వరదనీరు : 7 గేట్లు ఎత్తివేత

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు భారీగా వరదనీరు : 7 గేట్లు ఎత్తివేత

Heavy flood water to Yellampalli projectమంచిర్యాల : ఎగువన కురిసిన వర్షాలతో  ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 20,004 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 20,004 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 19.3974 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.