Home తాజా వార్తలు సింగూరు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు

సింగూరు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు

Heavy Floodwater Inflow To Singur Projectసంగారెడ్డి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి  31,921 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల  చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు కు 41,734  క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా,   34,944 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం  29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 29.266 టిఎంసీలుగా ఉంది సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.