Home Default సింగూరు ప్రాజెక్ట్ కు భారీగా వరదనీరు

సింగూరు ప్రాజెక్ట్ కు భారీగా వరదనీరు

Heavy Floodwater Inflow To Singurprojectసంగారెడ్డి : పుల్కల్ మండల పరిధిలోని సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో నీటిపారుదల శాఖ  అధికారులు ప్రాజెక్ట్  5,6, నెంబర్ గేట్లను రెండు మీటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేశారు. ఈ క్రమంలో సింగూరు ప్రాజెక్టు దిగువన మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.