Home తాజా వార్తలు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌దనీరు

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌దనీరు

Heavy Floodwater Inflow To Taliperu Projectభ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వ‌ర్షాలు  కురుస్తున్నాయి. దీంతో జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల‌ు జ‌ల‌క‌ళను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా చ‌ర్ల మండ‌ల ప‌రిధిలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఈ ప్రాజెక్టుకు 19 గేట్లు ఎత్తి దిగువ‌కు 36,700 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు ప‌రీవాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల‌ు అప్రమత్తంగా ఉండాలని  అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 34,900 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.