Home తాజా వార్తలు అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు

అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు

Marijuana

 

శంషాబాద్ : అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టును శుక్రవారం శంషాబాద్ ఆర్జీఐఎ పోలీసులు రట్టు చేసి ఒకరిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకోవడంతో పాటు 60ప్యాకెట్లలో ఉన్న 120కిలోల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జీఐఎ డిసిపి ఎన్.ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలోని బీధర్ జిల్లా అరుద్ తాలుకాలోని జనగిగామా తాండాకు చెందిన రాధోడ్ ధశరత్(19) ఐదవ తరగతి వరకు చదువుకొని మధ్యలోనే చదువును బంద్ చేసి లేబర్ పని చేస్తూ జీవనం సాగించాడు. అయితే మత్తుకు బానిస కావడంతో డబ్బులు సరిపోలేదు.

దీంతో అదే తాండాకు చెందిన సంతోష్ రాధోడ్(23), పరుషారామ్(23), దేవిదాస్(22)తో కలిసి అక్రమ గంజాయిని ఖమ్మం జిల్లాలోని చింతూర్ నుండి మహారాష్ట్రకు తరలించే వారు. అయితే ఇతనికి వచ్చిన వాటా రూ.1లక్ష 50వేలను విలాసలకు ఖర్చు పెట్టారు. మళ్లీ డబ్బుల కోసం గంజయ్‌ని తీసుకురావాడానికి ఖమ్మం వెళ్లి గంజాయి దొరకకపోవడంతో రెండు రోజులు అక్కడే ఉండి 120కిలోలు సేకరించినట్లు తెలిపారు.

గతంలో కూడా ఈ నలుగురు ఇదే జిల్లా నుండి మహారాష్ట్రలోని పూణే, ముంబాయ్‌కి అక్రమంగా గంజాయిని తరలించిన కేసులో అరెస్ట్ అయినారు. మళ్లీ ఈనెల 20వ తేదిన ఖమ్మం జిల్లా చింన్‌తూర్ నుండి కారులో తరలిస్తునట్లు పక్క సమాచారం అందండతో శంషాబాద్ మండల పరిధిలోని కిషన్‌గూడ ఫ్లైఓవర్ వద్ద నిఘా పెట్టగా శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో కారు రాగానే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే మరో ఇద్దరు వేరే అద్దె కారులో పరారు అయ్యారు. నింధితుని నుండి 60ప్యాకేట్‌లలో ఉన్న 120కిలోల గంజాయి, ఒక సెల్‌ఫోన్, రూ1500ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును డిసిపి ఆధ్వర్యంలో శంషాబాద్ జోన్ ఎసిపి అశోక్‌కుమార్, సిఐ పి.విజయ్‌కుమార్, అడిషనల్ సిఐ వెంకట్ రెడ్డి, పోలీసులు కలిసి విజయవంతం చేసినట్లు తెలిపారు.

Heavy Marijuana Possession