Friday, March 29, 2024

హైదరాబాద్ లో కుంభవృష్టి వర్షం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః నగరంలో భారీ వర్షం కురిసింది. గంట వ్యవధినే కుంభవృష్టిని తలపించింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతోనగరవాసులు కలవర పాటుకు గురైయ్యారు. గోల్కొండ , లంగర్ హౌజ్ పరిసర ప్రాంతంలో అత్యధికంగా 9.5 సె.మి., వర్షం కురిసింది. గంట లోపే పలు ప్రాంతాల్లో 5 నుంచి 9.5 సె.మి.ల పైగా వర్షం కురువడంతో 1908 సెప్టెంబర్ 28ను నగరవాసులు గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 115 ఏళ్ల కిత్రం నగరంలో కురిసిన అసాధారణ వర్షానికి సెప్టెంబర్ 28న మూసీనది ఉప్పొగింది.బుధవారం ఉదయం నుంచే నగరాన్ని మేఘాలు క కమ్మివేయడంతో వాతావరణం కొంత చల్లబడింది.ఇదే క్రమంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నగర వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం వేళా భారీ వర్షం కురువడంతో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరింది. దీంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే జామ్ ఏర్పడింది. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇంటికి వెళ్లేందుకు ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు వానలోనే తడుస్తూ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది.

మరోవైపు లొతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా జలమయం అయ్యాయి. వినాయక నిమజ్జనానికి ఒక్కరోజు ముందు భారీ వర్షం కురువడంతో భక్తులు ఖంగు తిన్నారు. చివరి రోజు వినాయక స్వామి భారీగా పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన భక్తులు . వర్షం కారణంగా కొంత విఘాతం కలిగడంతో నిరాశకు గురైయ్యారు. మరొవైపు భారీ వర్షంలోనే ట్యాంకుబండ్‌ను నిమజ్జనానికి భక్తులు తరలివచ్చారు. నగరవ్యాప్తంగా భారీ వర్షం కురువడంతో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. వెంటనే సహాయక బృందాలను అధికారులు రంగంలోకి దింపారు. మాన్సూస్ అత్యవసర సహాయక బృందాలతో పాటు డిఆర్‌ఎఫ్ టీమ్‌లు ఎక్కడికక్కడ సహాయక చర్యలను కొనసాగించాయి. రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మరోవైపు ఖైరతాబాద్‌లోని చింత బస్తీలో ఓనాలాలో మొసలి ప్రత్యేక్షం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో సమాచారం అందుకు ఎనిమల్ ప్రొడక్షన్ వారియర్స్ పోర్స్ బృందం నాలుగు గంటల పాటు శ్రమించి మొసలిని బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షం పాతం ః
ప్రాంతం వర్షం మి.మి.లో
గొల్కోండ, లంగర్‌హౌజ్ 95.3
రాజేంద్రనగర్ 73.0
అల్వాల్ 71.0
జూబ్లీహిల్స్ 68.3
టెలికాం కాలనీ 67.5
మియాపూర్ 61.5
విజయనగర్ కాలనీ 55.0
కాప్రా 52.5
శాస్త్రీపురం 52.0
గోషామహాల్ 50.5
బంజారాహిల్స్ 50.0
గౌలిగూడ 48.0
మల్కాజ్‌గిరి 46.3
ఆసీప్‌నగర్ 46.0
కుషాయిగూడ 45.3
కెపిహెచ్‌బి 44.5
సఫిల్‌గూడ 43.5

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News