Home తాజా వార్తలు హైదరాబాద్ కు భారీ వర్ష సూచన : రెడ్ అలర్ట్

హైదరాబాద్ కు భారీ వర్ష సూచన : రెడ్ అలర్ట్

Heavy Rain Forecast for Greater Hyderabadహైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు  రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ అధికారులు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. విరామం లేకుండా 6 నుంచి 8 గంట‌ల పాటు వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు ఇళ్లల్లోనే  ఉండాల‌ని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కోరారు.  స‌హాయం కోసం 040 – 2955 5500 నంబ‌ర్‌ను సంప్ర‌దించాల‌ని వారు నగర ప్రజలకు సూచించారు.