Friday, April 26, 2024

తెలంగాణకు భారీ వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

Heavy rain forecast for Telangana

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీమ్, సిద్ధిపేట, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఆది, సోమ వారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy rain forecast for Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News