Thursday, April 25, 2024

తెలంగాణకు భారీ వర్ష సూచన

- Advertisement -
- Advertisement -
Heavy rain forecast for Telangana
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలంగాణలో రాగల మూడ్రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్రటెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆది, సోమవారాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వివరించింది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంంగా తేలికపాటి జల్లులు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. కాగా ఈ నెల 14న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది క్రమంగా తుపానుగా రూపాంతరం చెంది ఒడిశా తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News