Wednesday, September 18, 2024

తెలంగాణకు భారీ వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

Heavy rain forecast for Telangana

హైదరాబాద్: తెలంగాణలో వర్షాల ముప్పు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. ఈ నెల 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గర్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర తీరానికి సమీపంలో తూర్పు మధ్య అరేబియా సముద్రం, సమీప ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Heavy rain forecast for Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News