Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Heavy Rain Forecastఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఎపిలతో పాటు యానాం, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అసోం తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిక్కిం, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని, ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడి అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పైన పేర్కొన్న రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.

Heavy Rain Forecast In Telangana And AP