Home తాజా వార్తలు హైదరాబాద్ లో భారీ వర్షం…

హైదరాబాద్ లో భారీ వర్షం…

Heavy rain

హైదరాబాద్: నగరంలో కురిసిన వానకు రోడ్లులన్ని జలమయంగా మారి చెరువులుగా తలపించాయి. దీంతో రెండుగంటల పాటు పలు రహదారులపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. దిల్‌షుక్‌నగర్, మలక్‌పేట,అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట, మెహిదిపట్నం, చిక్కడపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్‌బండ్, సోమాజిగూడ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. రోడ్లపై భారీ వరద నీరు నిలిచిపోవడంతో జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి లోతట్టుప్రాంతాల్లో నీటిని మ్యాన్‌హోల్ ద్వారా తొలగించారు. పలు ఏరియాలో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రధాన కూడళ్లవద్ద ట్రాఫిక్ స్తంబించడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేశారు.

 Heavy rain in Hyderabad