Wednesday, April 24, 2024

నగరంలో వర్షం

- Advertisement -
- Advertisement -

heavy rain in hyderabad today

హైదరాబాద్: నగరంలో శనివారం సైతం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయమంతా ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాలో మోస్తారు నుంచి చిరుజల్లులు పడ్డాయి. రాత్రి 9 గంటల వరకు నాచారంలో 3.4 సె.మి.వర్షపాతం నమోదు కాగా, రాజీవ్ నగర్‌లో 3, కాప్రాలో 2.6, బండ్లగూడలో 1.7 హయత్‌నగర్‌లో 1.7 చిలుకానగర్‌లో 1.6 సె.మి. వర్షం కురిసింది. అదేవిధంగా హబ్సిగూడ, బిహెచ్‌ఇఎల్, బలరాం నగర్, నేరేడ్‌మెట్, తిరుమల్‌గిరి, ఈస్ట్ ఆనంద్‌బాగ్, భవానినగర్, మైత్రివనం, మల్లాపూర్, జగద్గీరిగుట్ట, వెస్ట్ మారెడ్‌పల్లి, రామంతాపూర్, మారుతీనగర్, మోతినగర్, ఫిరోజ్‌గూడ, బాలానగర్, మౌలాలి, వనస్థలిపురం, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి చిరుజల్లులు పడ్డాయి.

heavy rain in hyderabad today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News