Friday, March 29, 2024

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy rainfall forecast for Telangana

హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉదయం 6గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఖమ్మంజిల్లా వేంసూరులో 18.7 సెం.మీ, సత్తుపల్లిలో 14.7 సెం.మీ, సదాశివునిపాలెంలో14 సెం.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లంలో 15.5 సెం.మీ, దమ్మపేట మండలం అంకంపాలెంలో 12 సెం.మీ, చంద్రుగొండ మండలం మద్దుకూరులో 12సెం.మీ, ములకలపల్లిలో 11.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జోరువాన కురుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం, చింతకాని, రఘునాధపాలెం, కూసుమంచి, భద్రచలం, దమ్ముగూడెం, చర్ల, భూర్గంపాడు, ఇల్లెందు, కొత్తగూడెం, చంద్రుగొడు, పాల్వంచ మండలాల్లో భారీ వర్షం కురిసింది.  అటు రాష్ట్రంలో పలు జిల్లాలో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News