Home తాజా వార్తలు రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

Heavy Rainfall

 

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రుతుపవనాల ఆగమనంతో ఉదయం నుంచే వాతావరణం చల్లగా మారగా.. సాయంత్రానికి దట్టమైన మేఘాలు ఆవరించాయి. గంటపాటు కురిసిన కుండపోత వర్షం కారణంగా ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సరూర్ నగర్ లో 7.4 సెం.మీలు, ఉప్పల్ 7 సెం.మీల వర్షపాతం నమోదాయింది. మెదక్ జిల్లాని టెక్మాల్ లో  5.4 సం. మీలు, నిజామాబాద్: కమ్మర్ పల్లి 5.3 సెం.మీ, కామారెడ్డి: పట్లంలో 5 సెం.మీ, రంగారెడ్డి: కడ్తాల్ 5 సెం.మీ, వరంగల్ అర్బన్: హసన్ పర్తి 4.8 సెం.మీ, వేలేరు 4.7 సెం.మీ, సంగారెడ్డి: ఆంధోల్ 4.6 సెం.మీల వర్షపాతం నమోదైంది.

Heavy Rainfall in Greater Hyderabad