Home తాజా వార్తలు తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

Heavy rains for two days in Telanganaహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం పలు చోట్ల  భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు. ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 6న ఉత్తర, మధ్య బంగా‌ళా‌ఖా‌తంలో అల్పపీ‌డనం ఏర్పడొ‌చ్చని అధికారులు అంచనా వేశారు. ఆది‌లా‌బాద్‌, కుమ్రంభీం, మంచి‌ర్యాల, నిర్మల్‌, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, కరీం‌న‌గర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సిద్ది‌పేట, రంగా‌రెడ్డి, హైద‌రా‌బాద్‌, మేడ్చల్‌-మ‌ల్కా‌జి‌గిరి, వికా‌రా‌బాద్‌, సంగా‌రెడ్డి, మెదక్‌, కామా‌రెడ్డి, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, వన‌పర్తి, నారా‌య‌ణ‌పేట, జోగు‌లాంబ గద్వాల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.