Wednesday, April 24, 2024

నా జీవితంలో ఇలాంటి వర్షం చూడలేదు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద వర్షం అని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ వరదలపై జిహెచ్ఎంసి కార్యాలయంలో సోమవారం మంత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. 40ఏండ్లగా తాను హైదరాబాదులో ఉన్నానని ఇంత భారీ వర్షాలను తానెప్పుడూ చూడలేదన్నారు. క్యుములోనింబస్ మేఘాలు వల్లే ఇలా జరుగుతుందని చెప్పారు.

జిహెచ్ఎంపి పరిధిలో ప్రస్తుతం 80కాలనీల్లో నీళ్లు ఉన్నాయి. బాధితులకు పనరావాస కార్యక్రమాలు ముమ్మరం చేశామని, అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. బాగ్యనగరంలో ప్రతి ఏడాది సగటున 78 సెం.మీ. వర్షం కురుస్తుందని తెలిపారు. తెలంగాణలో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లతో పాటు శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయించాల‌ని అధికారులను మంత్రి కెటిఆర్ సూచించారు. వరదల్లో చిక్కుకున్న బాధితుల  సహాయచర్యల కోసం రూ. 45 కోట్లను ఖర్చు చేశామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News