Home తాజా వార్తలు రాగల మూడ్రోజులు తెలంగాణలో వర్షాలు

రాగల మూడ్రోజులు తెలంగాణలో వర్షాలు

Heavy rains in next three days in telangana

హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం నైరుతి, పశ్చిమ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షంతో పాటు, ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. రేపు, ఎల్లుండి పలు చోట్ల వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.

Heavy rains in next three days in telangana