- Advertisement -
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ, అతిభారీ వర్షాలు కురియనున్నట్టు భారత వాతావరణశాఖ(ఐఎండి) తెలిపింది. అల్పపీడనం వల్ల ఏర్పడ్డ వాయుగుండం శుక్రవారం బెంగాల్‌లోని సాగర్ దీవులు, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా(సుందర్‌బన్ దీవులు) మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండి తెలిపింది. దీని ప్రభావంతో త్రిపుర, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, అస్సాం దక్షిణ ప్రాంతాలు, మేఘాలయలో శుక్ర,శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటం, వరద ముప్పు ఉంటుందని ఐఎండి అంచనా వేసింది.
- Advertisement -