Thursday, April 25, 2024

సిరిసిల్లాలో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం (వీడియోలు)

- Advertisement -
- Advertisement -

Heavy Rains in Rajanna Siricilla

రాజన్న సిరిసిల్లా: జిల్లాలో గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉదృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు వచ్చిన విషయం తెలుకున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రత్తమత్తంగా ఉండాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, చెరువులు, కుంటల పరిస్థితిని గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ముఖ్యాముగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్నిరకాల సహాయక చర్యలు తీసుకుంటుందని ప్రజలు ధైర్యంగా ఉండాలని మంత్రి చెప్పారు.

Heavy Rains in Rajanna Siricilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News